(Local) Sun, 20 Oct, 2019

ఆర్ఆర్ఆర్ లో బ్రిటీష్ బ్యూటీ…?

August 21, 2019,   1:39 PM IST
Share on:
ఆర్ఆర్ఆర్ లో బ్రిటీష్ బ్యూటీ…?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్, నందమూరి టైగర్ ఎన్టీఆర్ హీరోస్ గా తెరకెక్కుతున్న చిత్రం  “ఆర్ఆర్ఆర్”. ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం ఇటు మెగా ఫాన్స్ అటు నందమూరి ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా సంగతి తెలిసిందే.  టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, సముద్ర ఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. ఈ మూవీలో రెండు నిజ పాత్రలు క‌ల్పిత క‌థాంశమే అని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. ముందుగా చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న డైసీ ఎడ్గార్ జోన్స్‌ని ఎంచుకున్నాడు రాజ‌మౌళి. కాని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ప‌లువురి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఇటీవ‌ల అమెరిక‌న్ న‌టి ఎమ్మా రోబ‌ర్ట్స్‌ని ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు చిత్ర బృందం. తాజా సమాచారం ప్ర‌కారం మరో మారు బ్రిటిష్ నటినే క‌థానాయిక‌గా ఎంపిక చేయాల‌ని రాజ‌మౌళి అండ్ టీం భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం టీం బ‌ల్గేరియా వెళ్లేందుకు సిద్ద‌మైంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30,2020న విడుద‌ల చేయ‌నున్నారు.

సంబంధిత వర్గం
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.