(Local) Mon, 18 Nov, 2019

‘జోడి’ విడుదల తేదీ ఖరారు!

August 07, 2019,   9:02 PM IST
Share on:
‘జోడి’ విడుదల తేదీ ఖరారు!

యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 6న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందనవచ్చింది. టీజర్ ఆసాంతం చాలా ఆహ్లాదంగా ఉన్నట్టుగా ప్రశంసలు వచ్చాయి. ఆది సాయికుమార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంటూనే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది ఈ జోడి.

ముఖ్యంగా ప్రధాన జోడి మధ్య ఉండే ప్రేమకథ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఆదిసాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడి అద్భుతమైన ప్లానింగ్ వల్ల జోడీ చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడని నిర్మాతలు ఉండటంతో అనుకున్నదాని కంటే ఇంకా బాగా వచ్చింది చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్న జోడి చిత్ర ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వర్గం
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.