(Local) Fri, 07 May, 2021

దేశీయ సినిమాలకు ఝలక్ ఇస్తున్న'జోకర్'

October 05, 2019,   1:09 PM IST
Share on:
దేశీయ సినిమాలకు ఝలక్ ఇస్తున్న'జోకర్'

దసరా పండుగను, గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2న రెండు రోజుల క్రితం మూడు భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. వాటిలో టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' కాగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల మల్టీ స్టారర్ మూవీ 'వార్' తో పాటు హాలీవుడ్ మూవీ 'జోకర్' ఉన్నాయి. అయితే ఈ సినిమాలు విడుదలైన రోజు నుండి పాజిటివ్ రివ్యూ రాడంతో పాటు, వర్డ్ అఫ్ మౌత్ బాగుండటంతో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఐతే చెన్నై సిటీలో సైరా, వార్ చిత్రాలకి హాలీవుడ్ మూవీ 'జోకర్' మాత్రం గట్టి పోటీ ఇస్తోంది. చెన్నై సిటీలో దేశీయ సినిమాలైనా సైరా, వార్ లకంటే జోకర్ మూవీ ఎక్కువ వసూళ్లు సాధించి ఝలక్ ఇచ్చింది. రెండవ రోజు చెన్నై నగరంలో జోకర్ చిత్రం 19లక్షల వసూళ్లు సాధించగా, సైరా మరియు వార్ చిత్రాలు సరిసమానంగా 14లక్షల వసూళ్లు రాబట్టాయని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా జోకర్ మొదటిరోజు 5.4 మిలియన్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. భారత్, కొరియా, ఇండోనేషియా, బెల్జియం దేశాలలో కలిపి మొత్తం జోకర్ మొదటి రోజు ఈ ఈమొత్తాని వసూలు చేయడం జరిగింది.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.