(Local) Sat, 24 Jul, 2021

“జెర్సీ” హిందీ రీమేక్ లో కూడా అతడే హీరో...?

October 14, 2019,   7:37 PM IST
Share on:
“జెర్సీ” హిందీ రీమేక్ లో కూడా అతడే హీరో...?

వెండితెరపై విడుదలైన మూవీలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయంతో పాటు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రపైన ప్రతి ఇండస్ట్రీ దర్శక..నిర్మాతల చూపు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు...ఇటీవలే తెలుగులో విడుదలైన నాచురల్ స్టార్ నాని నటించిన  'జెర్సీ' మూవీ ఎలాంటి విజయం సాధించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. నాని క్రికెట‌ర్‌గా అద‌రగొట్టాడ‌ని సెలెబ్రిటీలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషించాడు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, అమ‌న్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 28న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. తెలుగులో సంచలన విజయం సాధించిన జెర్సీ.. హిందీలోనే అదే రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. 

సంబంధిత వర్గం
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
మల్టీస్టారర్ సినిమా కోసం ఇన్ని కత్తులా ?
మల్టీస్టారర్ సినిమా కోసం ఇన్ని కత్తులా ?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.