(Local) Sun, 20 Oct, 2019

విదేశీ ఫ్యాన్ కి ఫిదా అయిన యంగ్ హీరో....

September 14, 2019,   12:24 PM IST
Share on:
విదేశీ ఫ్యాన్ కి ఫిదా అయిన యంగ్ హీరో....

బాషా ఏదైనా సినిమా నచ్చితే అభిమానం అనేది పెరగటం సహజం. మన తెలుగు చిత్రాలకి కూడా విదేశాలలో మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా  థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన చిత్రం "ఎవరు".  అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీపై విమ‌ర్శ‌కుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌న‌దేశంలోనే కాక విదేశాల‌లోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇటీవ‌ల జ‌ప‌నీస్ ఫ్యాన్ రినా టోక్యోలో జ‌ప‌నీస్ డ‌బ్బింగ్ వ‌ర్షన్ చూసింది. ఇండియ‌లోను సినిమా చూడాల‌ని హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు హీరో అడ‌వి శేష్‌ని క‌లుసుకొని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. సినిమా త‌న‌కెంతో న‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది. ఆయ‌న‌తో కొద్ది సేపు స‌ర‌దా స‌మ‌యం కూడా గడిపింది. జ‌ప‌నీస్ అభిమాని త‌న‌పై చూపించిన ప్రేమ‌ని చిన్న వీడియో ద్వారా చూపించాడు శేష్‌.

సంబంధిత వర్గం
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.