(Local) Sat, 19 Oct, 2019

చిక్కుల్లో మలయాళ సూపర్ స్టార్...

September 21, 2019,   8:38 PM IST
Share on:
చిక్కుల్లో మలయాళ సూపర్ స్టార్...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు... విలక్షణ నటుడిగా, ప్రొడ్యూసర్, సింగర్ గా పేరుగాంచిన మోహన్ లాల్... ప్రస్తుతం చిక్కుల్లో పడ్డట్టుగా కనిపిస్తోంది. కేరళ అటవీశాఖ ఆయనపై చార్జిషీట్ నమోదు చేసింది. 2012లో మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎర్నాకుళంలోని కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. ఆ కేసు తాజాగా కోర్టు ముందుకు వచ్చింది. 

ఈ క్రమంలో కేర‌ళ ప్ర‌భుత్వం స్పందించింది. ఏనుగు దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్‌లాల్‌కు సరైన అనుమతి లేదని తేల్చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఈయనకు ఎలాంటి అనువైన అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో కేస్ మళ్లీ మొదటికి వచ్చేసింది. దాంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3)తో మోహన్‌లాల్‌పై నేరం రుజువు చేయొచ్చని హైకోర్టు తేల్చడం సంచలనంగా మారింది. మోహన్ లాల్ ప్రముఖ నటుడు కావడంతో ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా పిటిషనర్‌ హైకోర్టును కోరాడు. అప్పట్లో మోహన్ లాల్ ఇంట్లో సోదాలు చేసినపుడు కూడా ఐటీ అధికారులు ఆ దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఈయనపై కేస్ నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాను కె కృష్ణన్‌ అయ్యర్‌ అనే వ్యక్తి నుంచి 65 వేల రూపాయలకు వీటిని కొనుగోలు చేశానని మోహన్‌లాల్ గ‌తంలో చెప్పుకొచ్చాడు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.