(Local) Fri, 22 Oct, 2021

దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఐటి దాడులు...

November 20, 2019,   1:35 PM IST
Share on:
దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఐటి దాడులు...

ఈ మధ్య ఐటీ శాఖ వారి చూపులు టాలీవుడ్ ఇండస్ట్రీ మీద పడింది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలపైనా ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందట మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, కేఎల్ నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు. అంతకంటే ముందు ఏషియన్ సినిమాస్ కు చెందిన వ్యక్తుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగినాయి. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.  ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

మొత్తం మూడు చోట్ల ఒకేసారి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెలుగు చిత్రసీమకు చెందిన కొందరు నటులు, దర్శకనిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. వెంకటేష్ సహా మొత్తం పది చోట్ల సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం జరిపే తనిఖీలలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా సినీప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై జరుగుతున్న ఐటీ దాడులు కూడా ఈ తరహా చైన్ లింక్ వ్యవహారమే అని అనుమానిస్తున్నారు చాలామంది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.