(Local) Sat, 19 Jun, 2021

కన్నడ నటిపై - నిర్మాతల ఆగ్రహం

August 20, 2019,   4:53 PM IST
Share on:
కన్నడ నటిపై - నిర్మాతల ఆగ్రహం

'చలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక . ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షుకుల అభిమానం సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ కన్నడ భామ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. దర్శకుడు భాగ్యరాజ కన్నన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కొద్దిరోజులుగా ఎలాంటి హడావిడి లేకుండా సినిమా షూటింగ్ ని నిర్వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ని ప్రకటించలేదు. అయితే అనుకోకుండా రష్మిక సోషల్ మీడియా ద్వారా టైటిల్ ని బయటపెట్టేసింది. తాజాగా చిత్రీకరణ పాల్గొన్న రష్మిక ‘సుల్తాన్’ షూటింగ్ లో నాల్గవ రోజు అంటూ టైటిల్ చెప్పేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తనకు తెలియకుండానే టైటిల్ రివీల్ చేసేసింది. ఈ విషయం కాస్తా యూనిట్ కి తెలిసిపోయింది. అధికారికంగా టైటిల్ ప్రకటించడానికి ప్లాన్ చేసుకున్న చిత్రయూనిట్ కి రష్మిక ఈ విధంగా షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను భారీ స్థాయిలో విడుదల చేయాలని దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్, నిర్మాతలు భావించారు. అందుకు ఓ ఈవెంట్ నిర్వహించాలని కూడా అనుకుంటున్న వేళ రష్మిక ఇలా చేయడంతో నిర్మాతలు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.