(Local) Sat, 24 Jul, 2021

చియాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ప్రముఖ క్రికెటర్

October 15, 2019,   6:18 PM IST
Share on:
చియాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ప్రముఖ క్రికె ...

భారత స్టార్ పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళ 'చియాన్‌' విక్రమ్‌తో కలిసి త్వరలో ఓ సినిమాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్‌లో తెలిపాడు. తమిళ యువ డైరెక్టర్ అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే మరో బౌలర్ శ్రీశాంత్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పాత్ర గురించి ఇర్ఫాన్‌ వెల్లడించలేదు. కానీ.. టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌ పఠాన్‌ కనిపించనున్నాడని సమాచారం . విక్రమ్‌ నటించే 58వ సినిమా ఇది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించనున్న ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఇర్ఫాన్‌ పఠాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియో ట్వీట్‌ చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.