(Local) Mon, 30 Nov, 2020

ఇండియన్ 2 ఫస్ట్ లుక్....

August 16, 2019,   6:55 PM IST
Share on:
ఇండియన్ 2 ఫస్ట్ లుక్....

అప్పట్లో 1996లో ప్రముఖ దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. మళ్ళి 20 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో భారతీయుడు 2 తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండియన్ 2 ఫస్ట్ లుక్ ను గురువారం విడుదల చేసింది చిత్ర బృందం. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళం, తెలుగు, హిందీతో పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో తీయనున్నారు. భారతీయుడు2లో కమల్ హాసన్ కు జోడీగా ప్రముఖ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలో, నెగటివ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ సైతం ప్రముఖ పాత్రలో నటించనున్నారు. ఆగష్టు 15 పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. భారతీయుడులో పోషించిన సిబిఐ అధికారి పాత్రలోనే ఈ సినిమాలో కూడా నెడుమూడి వేణు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వర్గం
అయోమయంలో పడ్డ రకుల్..?
అయోమయంలో పడ్డ రకుల్..?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.