(Local) Fri, 22 Oct, 2021

హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు

November 20, 2019,   1:07 PM IST
Share on:
హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు

టాలీవుడ్ సినీ స్టార్స్ టార్గెట్‌గా ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి.. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలువురు సినీ తారల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తెలుగు చిత్రసీమ ప్రముఖులే లక్ష్యంగా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటుడు నానిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ గురైంది. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.