(Local) Mon, 12 Apr, 2021

వాళ్లతో నేను సినిమా తీయట్లేదు...వర్మ

October 30, 2019,   1:40 PM IST
Share on:
వాళ్లతో నేను సినిమా తీయట్లేదు...వర్మ

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల అనుబంధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించి ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్,  పోస్టర్స్, ట్రైలర్ ను రిలీజ్ చేసి పలు వివాదాలకు తెరలేపాడు. తాజాగా వర్మ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసి మరో కొత్త వివాదానికి తావు ఇచ్చాడు. ఒకవైపు ఈ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా వివాదం కొనసాగుతోంటే సోమవారం రోజున వర్మ మరో వివాదాస్పద సినిమాను ప్రకటించారు. ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌ను ప్రకటించి ఇదే తన తర్వాతి సినిమా అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అందరు వర్మ తరువాత చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేసారని అనుకున్నారు. ‘మెగా ఫ్యామిలీ’ సినిమాకు సంబదించిన వివరాలను మంగళవారం ప్రకటిస్తానని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం వర్మ మనసు మార్చుకున్నాడు. తాను ‘మెగా ఫ్యామిలీ’ సినిమా చేయడంలేదని ప్రకటించారు. ‘మెగా ఫ్యామిలీ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, నేను చిన్న పిల్లలపై సినిమాలు చేయను కాబట్టి, ఈ సినిమాను చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్ చేశారు..

సంబంధిత వర్గం
వర్మకు హైకోర్టు షాక్....
వర్మకు హైకోర్టు షాక్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.