(Local) Mon, 17 Jun, 2019

బిగ్ బి మూవీ ని రీమేక్ చేయనున్న హృతిక్

June 08, 2019,   2:44 PM IST
Share on:

ఇప్పుడంతా  చిత్రపరిశ్రమలలో రీమేక్‌ చిత్రాల హావ నడుస్తుంటుంది. తాజాగా మరో అమితాబ్‌ సినిమా రీమేక్‌లో హృతిక్‌ నటించబోతున్నాడని బాలీవుడ్‌ సమాచారం. అమితాబ్‌ బచ్చన్, హేమామాలిని 1982వ సంవ‌త్సరంలో కలిసి నటించిన చిత్రం ‘సత్తే పె సత్తా’ మంచి విజ‌యం సాధించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందించేందుకు ప్రాధమిక ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం షారూఖ్‌ని అనుకున్నారు కాని కథకు హృతిక్ అయితే సరిగ్గా సరిపోతాడని నిర్మాత‌లు హృతిక్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌కి హృతిక్ ఓకే చెప్పినట్టు స‌మాచారం. సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే ప్రారంభించి వచ్చే సంవత్సరం విడుదల చేసే ప్లానింగ్ లో ఉంది టీమ్. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.