(Local) Sun, 17 Oct, 2021

మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ జాబితాలో...పిల్లి కళ్ల హీరో

August 19, 2019,   11:47 AM IST
Share on:
మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ జాబితాలో...పిల్లి కళ్ల హీరో

సినీ రంగంలో చాలమంది హీరోలు అందంగా ఉంటారు, కండలు అందరు పెంచుతారు కానీ కొందరికి మాత్రమే సరియిన గుర్తింపు వస్తుంది. హాలీవుడ్ హీరోలని చూసినప్పుడు ఇలాంటి అందం, అందానికి తగ్గ ఫీజిక్, దానికి సరితూగే బాడీ లాంగ్వేజ్ ఎవరికి ఉంది మన హీరోస్ లో అని ఆలోచిస్తే టక్కున గుర్తుకి వచ్చే పేరు హృతిక్‌ రోషన్‌. బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్‌ రోషన్‌కు ప్రపంచంలోనే అత్యంత అందగాడిగానూ బిరుదు ఉంది. ఆయన ఏజ్ పెరుగుతుంది గానీ... అదం మాత్రం తగ్గడం లేదు.. ఏ సన్నివేశంలో నటించినా... ఏ స్టెప్ వేసినా.. ఏ ఫైట్ చేసినా ఆయన ఇట్టే ఒదిగిపోతారు. కండలు అందరూ పెంచుతారు.. కానీ, కండలకు తగిన బాడీ అంటే హృతిక్‌దే.. ఇక, తాజాగా, కొత్త రికార్డు సృష్టించాడు మన బాలీవుడ్ హీరో. ఈ ఏడాదికి గానూ తాజాగా విడుదల చేసిన టాప్ 5 మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ జాబితాలో హృతిక్‌ టాప్ స్పాట్‌కు దూసుకెళ్లాడు. క్రిస్ ఎవాన్స్, డేవిడ్ బెక్హాం, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ హృతిక్ 'ది మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ ఇన్ ది వరల్డ్' జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు. యూఎస్‌కు చెందిన ఓ ఏజెన్సీ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఐదో స్థానంలో నిలిస్తే.. ట్విలైట్ స్టార్ రాబర్ట్ పాటి సన్, కెప్టెన్ అమెరికా మూవీ నటుడు క్రిస్ ఇవాన్స్ హృతిక్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. సూపర్ మ్యాన్ స్టార్ హెన్రీ కెవిల్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించగా.. జేమ్స్ బాండ్ స్టార్ టామ్ హిడిల్ స్టన్ తొమ్మిదో ప్లేస్ లో నిలిచాడు.

సంబంధిత వర్గం
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.