(Local) Sun, 27 Sep, 2020

గురుశిష్యుల మధ్య మొదలైన 'వారు'.....

August 27, 2019,   3:47 PM IST
Share on:
గురుశిష్యుల మధ్య మొదలైన 'వారు'.....

ఇద్దరు కండలు తిరిగిన హీరోలు ఒకేసారి తెరమీద కనిపిస్తే, అంతేకాక వారిద్దరి మధ్య పోటాపోటినా ఒళ్ళు గగురుపొడిచే ఫైటింగ్ సీన్స్ ఉంటే...అలాంటి ఓ సినిమా తెరమీద కనిపిస్తే ఆ సందడి గురించి వివరించాల్సిన అవసరం ఉందని అనుకోవటం లేదు.. ఎందుకంటే అందులో ఉండే కిక్ వేరబ్బా.... బాలీవుడ్ సూపర్‌స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తొలిసారి ‘వార్’ చిత్రంతో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఒకరు ప్రతినాయకుడి పాత్రలో మరొకరు అతన్ని పట్టుకునే పోలీసు పాత్రలో కనిపించనున్నారు.   2 నిమిషాల 25 సెకన్ల ట్రైలర్‌ ప్రేక్షకులను కన్నార్పకుండా చూసేలా చేస్తోంది. సినిమాలో హృతిక్‌ కబీర్‌గా, టైగర్‌ ఖలీద్‌గా కనిపించనున్నారు. విభిన్న గెటప్స్‌లో అందరినీ చంపేస్తుంటాడు హృతిక్. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు టైగర్‌ను రంగంలోకి దింపుతారు. కానీ హృతిక్ కూడా ఇందులో పోలీసు అధికారేనని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులగా ఎందుకు మారారు అన్నదే వార్‌ కథ. సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని హిందీతో పాటు  తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.