(Local) Sun, 27 Sep, 2020

బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాశ్ కన్నుమూత

August 07, 2019,   9:21 PM IST
Share on:
బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాశ్  కన్నుమూత

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హృతిక్ తాత ఓం ప్రకాశ్ భగవాన్ దాదా (93) బుధవారం కన్నుమూశారు. ఆప్‌కి కశమ్, ఆఖిర్ క్యోన్, అప్నాపామ్, ఆశా, అప్నాబానాలో, అర్పన్ ఆద్మీ ఖైలోనా హాయ్ సినిమాలకు దర్శకత్వం వహించగా ఆయే దిన్ బహర్ కీ, ఆయ్ శవాన్ ఝుమ్‌కీ, అంఖన్ అంఖన్ మేన్ అనే హిట్ సినిమాలకు నిర్మాతగా పని చేశాడు. మా తాతను ప్రేమిస్తూనే ఉంటానని తాత సహాయం లేకుంటే తనకు జీవితం లేదని గతంలో హృతిక్ అన్నారు. ఓమ్ ప్రకాశ్ కూతురు పింకీ నటుడు రాకేశ్ రోషన్ ను పెళ్లి చేసుకుంది. పింకీ-రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. ఓం ప్రకాశ్ మృతి బాలీవుడ్ కు తీరని లోటు అని సినిమా ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించారు.  

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.