(Local) Wed, 02 Dec, 2020

కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా...?

October 19, 2019,   3:48 PM IST
Share on:
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...

కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహ రెడ్డి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సాధించిపెట్టింది మెగాస్టార్. ఈ సైరా మూవీ తర్వాత మెగాస్టార్ ఎక్కువ గ్యాప్ లేకుండా తన 152వ చిత్రాన్ని కొరటాల డైరెక్షన్ లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిత్రాల్లో చిరు ఫ్యాన్స్ కోరుకునేది హీరో ఎలివేషన్స్. ఈ విషయానికి వస్తే కొరటాల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తాడు. కొరటాల సినిమా అంటే ఎలివేషన్స్ కి పెట్టింది పేరు. సో ఎలివేషన్ విషయంలో ఫ్యాన్స్ కి దిగులు లేదు. ఇక చిరు ప్రధాన బలమైన డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చూస్తారు. డ్యాన్సులు లేందే చిరు సినిమా ఒప్పుకోరు. సో ఇది కూడా ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఉండబోతుంది. ఇక మరొకటి చిరు కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. కానీ కొరటాల సినిమాలు అంటే కామెడీ అసలు ఉండదు. అతని సినిమాల్లో హీరోస్ అంత ఏదో సీరియస్ మోడ్ ఆన్ చేసినట్టే ఉంటారు. సో ఈ మూవీలో ఫ్యాన్స్ కామెడీ ని పెద్దగా ఎక్సపెక్ట్ చేసుకోవద్దు

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.