(Local) Fri, 23 Jul, 2021

‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ టాక్....

September 27, 2019,   6:22 PM IST
Share on:
‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ టాక్....

వెండితెరపై కొన్ని చిత్రాలు సీక్వెల్ తెరకెక్కడం చూస్తూనే ఉంటాం...అలా వచ్చిన అన్ని చిత్రాలు హిట్ ని సొంతం చేసుకుంటాయి అని కచ్చితంగా చెప్పలేము...అయితే ఈ విషయంలో మాత్రం బాలీవుడ్ మాత్రం వర్తించదేమో....ఎందుకంటే బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ సిరీస్‌ ‘హౌస్‌ఫుల్‌’ మూవీ ప్రతిసారి విజయాన్ని సొంతం చేసుకుంటూనే వస్తోంది. తాజాగా ఈ సక్సెస్‌ఫుల్‌ సిరీస్‌ ‘హౌస్‌ఫుల్‌’లో భాగంగా వస్తోన్న సినిమా ‘హౌస్‌ఫుల్‌ 4’. ఇప్పటి వరకు హౌస్‌ఫుల్ సిరీస్‌లో వచ్చిన కామెడీ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారు. పునర్జన్మల నేపథ్యంలో దాదాపు 600 సంవత్సరాల వ్యవధిలో (1419 నుండి 2019 వరకు) ఈ కథ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఫర్హాద్ సంఝీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలయింది. ఫన్నీ సన్నివేశాలు, కథాంశంతో రూపొందించిన ఈ ట్రైలర్‌ నవ్వులు పూయిస్తోంది.

ట్రైలర్ లో...అక్షయ్‌ కుమార్‌కు గత జన్మ గుర్తొస్తుంది. కానీ ఆయనతోపాటు ఉన్న రితేష్‌, బాబీ, పూజా, కృతి, కృతి సనన్‌లకు గుర్తురాదు. వారికి గత జన్మ గుర్తు చేయడానికి అక్షయ్‌ తంటాలు పడుతూ కనిపించారు. ‘నీకు మాత్రం గత జన్మ ఎలా గుర్తొచ్చింది?’ అని రితేష్‌, పూజా ప్రశ్నించగా.. అక్షయ్‌ కుమార్‌ ‘ఏమో.. నాకు తెలియదు’ అని సమాధానం చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఇందులో బాలా, హ్యారీ పాత్రల్లో అక్షయ్‌ కనిపించారు. నర్తకి బంగ్‌డు మహరాజ్‌గా రితేష్‌, రాజకుమారి మాల పాత్రలో పూజా హెగ్డే, రాజకుమారి మధుగా కృతి, అంగరక్షక్‌ ధర్మపుత్రగా బాబీదేవోల్‌ లుక్‌లు ఆకట్టుకున్నారు.. ఇందులో రానా పాత్రను భయంకరమైన విలన్‌గా చూపించారు. అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించారు. ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.