(Local) Mon, 27 Sep, 2021

మాస్క్ లో శివ కార్తికేయన్ సెకండ్ లుక్ పోస్టర్....

October 20, 2019,   9:09 PM IST
Share on:
మాస్క్ లో శివ కార్తికేయన్ సెకండ్ లుక్ పోస్టర్....

కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌ నిర్మాణంలో PS మిత్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ...‘హీరో’. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇదివరకే ఈ మూవీ నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ‘హీరో’ చిత్రం నుండి చిత్రయూనిట్ సెకండ్ లుక్ విడుదల చేశారు. శివ కార్తికేయన్ మాస్క్‌తో పవర్‌ఫుల్ మ్యాన్‌లా కనిపిస్తున్న పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. భయం లేని ఒక సాధారణ యువకుడు యోధుడిలా మారి అక్రమార్కులపై పోరాటం చేసి.. ప్రజలకు ఎలా సహాయ పడ్డాడు  అనే  పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరో విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు)సినిమాకు దర్శకత్వం వహించి ప్రశంసలందుకున్న మిత్రన్ ‘హీరో’ చిత్రాన్ని చాలా బాగా రూపొందిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిస్మస్  ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 20న ‘హీరో’ మూవీప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. 

సంబంధిత వర్గం
సల్మాన్ ఖాన్ విడుదల చేసిన 'హీరో' టీజర్
సల్మాన్ ఖాన్ విడుదల చేసిన 'హీరో' టీజర్
ప్రణవ్ – కల్యాణి ప్రేమలో పడ్డారా..?
ప్రణవ్ – కల్యాణి ప్రేమలో పడ్డారా..?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.