(Local) Wed, 03 Jun, 2020

నయా లుక్‌ లో రామ్ ...

August 11, 2019,   6:20 PM IST
Share on:
నయా లుక్‌ లో రామ్ ...

తన నయా లుక్‌ను చూపిస్తూ ఓ షాకింగ్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు హీరో రామ్ పోతినేని . ఓ భిన్నమైన షర్ట్ ధరించి, ఫ్రెంచ్ గడ్డం, గుండు చేయించుకొని ఉన్న రామ్ ఎప్పుడూ చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ విస్మయానికి గురిచేశారు. మైల్డ్ లీ వైల్డ్, వైల్డ్ లీ మైల్డ్ … అనే ఓ ఆసక్తికర క్యాప్షన్ కూడా ఆ ఫోటోకి ట్యాగ్ చేశారు.‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల తరువాత రామ్ కుటుంబంతో కలిసి విదేశీ టూర్‌కి వెళ్లడం జరిగింది. కొద్దిరోజుల క్రితం ట్రిప్ ముగించుకొచ్చిన ఈ కథానాయకుడు ఏ వేడుకలో చూసినా క్యాప్‌తో కనిపించారు. ఆయన ఎప్పుడూ క్యాప్ పెట్టుకొని ఉండటం వెనుక గల అసలు కారణాన్ని నేడు ఈ ఫోటో ద్వారా తెలియజేశారు రామ్. అయితే ఈ నయా లుక్ అతను చేయబోయే తదుపరి చిత్రం కొరకా లేదా సరదాగా అలా ట్రై చేశారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వర్గం
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.