(Local) Sat, 24 Jul, 2021

చదరంగం ఆటగాడిగా నితిన్?

October 07, 2019,   2:48 PM IST
Share on:
చదరంగం ఆటగాడిగా నితిన్?

2016లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' మూవీతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్, ఆ తర్వాత ఈ మూడేళ్ళలో లై, ఛల్ మోహన్ రంగ,  శ్రీనివాసకల్యాణం లాంటి చిత్రాలలో నటించినప్పటికీ విజయాన్ని మాత్రం చవి చూడలేకపోయాడు. విషయం అర్థంచేసుకున్న ఈ హీరో సినిమాలకి చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేస్తూ   తనకి సూట్ అయ్యే సబ్జెక్ట్ రాగానే ఒకేసారి మూడు సినిమాలు ఓకే చేసాడు. నితిన్ ఓకే చేసిన మూడు సినిమాల్లో మొదటిది ఛలో డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా భీష్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత రంగ్ దే అనే టైటిల్ తో మరొకటి చేస్తున్నాడు. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు చంద్ర శేఖర్ ఏలేటి సినిమా కూడా సైమల్టేనియస్‌గా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా కూడా ఒక షెడ్యూల్ పూర్తిచేసుకోవడంతో ఇప్పుడు సినిమాకి 'చదరంగం' అనే టైటిల్ పెట్టారు ఫిక్స్ చేసారు. ఈ మూవీలో నితిన్ చదరంగం ఆటగాడుగా కనిపించనున్నాడు. సినిమాలో నితిన్ జీవితానికి, ఈ గేమ్ కు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. అందుకే ఈ సినిమా కు ఆ టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ మూవీ రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. నితిన్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెండో హీరోయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రియాప్రకాష్ వారియర్ కనిపిస్తుంది. ఈ సినిమా కి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత వర్గం
జార్జిరెడ్డిపై మెచ్చకుంటున్న టాలీవుడ్ ప్రముఖులు...
జార్జిరెడ్డిపై మెచ్చకుంటున్న టాలీవుడ్ ప్రముఖులు...
‘భారతీయుడు 2’ సెట్ లో రకుల్ ప్రీత్
‘భారతీయుడు 2’ సెట్ లో రకుల్ ప్రీత్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.