(Local) Wed, 20 Oct, 2021

చిన్న పాప లాగా బిగుసుకుపోయిన ఈ అమ్మ మా అమ్మ...నాని

October 15, 2019,   12:37 PM IST
Share on:
చిన్న పాప లాగా బిగుసుకుపోయిన ఈ అమ్మ మా అమ్మ...నాని

కన్న బిడ్డ ఎంత పెద్ద హోదాలో ఉన్నపటికీ తల్లికి మాత్రం ఎప్పిటికి తన పిల్లలు చిన్నవాళ్ళే అని చెబుతుంటారు. ప్రపంచంలో ఎంత సంపాదించినా వెలకట్టలేని ప్రేమ అమ్మ ప్రేమ...టాలీవుడ్ హీరో నాని తన తల్లి విజయలక్ష్మికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో నేచుర‌ల్ స్టార్ నాని చాలా యాక్టివ్ గా ఉంటారని తెలిసిన సంగతి. ఎప్పిటికప్పుడు నాని తన పనిచేసే మూవీ అప్‌డేట్స్ అభిమానులకి అందుబాటులో సొసైల్ మాధ్యమాలలో పంచుకుంటూనే ఉంటారు. అంతేకాక తన ఫ్యామిలీ లో జరిగే ముఖ్యమైన సంఘటనలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. గ‌త ఏడాది మార్చిలో తొలిసారిగా త‌న త‌ల్లిని ప‌రిచ‌యం చేశాడు నాని . త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మీ 30 ఏళ్ళుగా ఫార్మసిస్ట్‌గా ప‌నిచేస్తూ ప‌దవీ విర‌మ‌ణ చేస్తున్న సంద‌ర్భంగా తల్లితో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేసారు... తాజాగా అక్టోబ‌ర్ 14న త‌న త‌ల్లి బ‌ర్త్ డే కావ‌డంతో ఆమె ఫోటో పోస్ట్ చేసి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు నాని . ఈ అమ్మే మా అమ్మ అంటూ అందరికీ సరికొత్తగా పరిచయం చేశారు. ఫోటో అనగానే వినయంగా యూనిట్ టెస్ట్ లో ఫస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ లాగా...కొత్త బట్టలు వేసుకున్న చిన్న పాప లాగా బిగుసుకుపోయిన ఈ అమ్మ మా అమ్మ .. మా ఇంటికి అమ్మ .. హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మ‌.. ల‌వ్ యూ సోమచ్ అంటూ కామెంట్ పెట్టాడు. రీసెంట్‌గా గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాని ప్ర‌స్తుతం వి అనే సినిమాలో న‌టిస్తున్నాడు. 

సంబంధిత వర్గం
హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
రివ్యూ: గ్యాంగ్ లీడర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.