(Local) Sun, 17 Jan, 2021

హరీష్ నెక్స్ట్ సినిమా ఏంటి ?

October 01, 2019,   6:14 PM IST
Share on:
హరీష్ నెక్స్ట్ సినిమా ఏంటి ?

హరీష్ శంకర్ చాలా గ్యాప్ తీసుకుని వరుణ్ తేజ్ తో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వాల్మీకి) తీసి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను తెరపైకి తీసుకుని రావడానికి చాలా కష్టపడ్డాడు హరీష్. మొదటి రోజు నుండి హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. అయితే దీని తర్వాత హరీష్ కచ్చితంగా స్టార్ హీరోతో చేసే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. తాజాగా హరీష్ మాట్లాడుతూ...వరుణ్‌లో పాన్ ఇండియా స్టార్ అయ్యే ల‌క్ష‌ణాలున్నాయ‌ని, అత‌డితో ఓ బ‌హుభాషా చిత్రం చేయాల‌నుకుంటున్నాన‌ని తెలిపాడు. అయితే ఈమూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం చెప్పలేదు. మరి హరీష్ వరుణ్ తో ఎటువంటి సినిమా తీస్తాడు అనేది చూడాలి. ఆమధ్య హరీష్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ దాగుడుమూత‌లు సినిమాకు ఒక హీరోగా వ‌రుణ్‌నే అనుకున్నాడు అది వర్కౌట్ అవ్వలేదు. 

సంబంధిత వర్గం
వాల్మీకి నుండి దేవీశ్రీ అందుకే తప్పుకున్నాడా?
వాల్మీకి నుండి దేవీశ్రీ అందుకే తప్పుకున్నాడా?
"హరీష్ కు అండగా ఉంటాం"

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.