(Local) Sun, 20 Jun, 2021

‘సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ లుక్...

November 12, 2019,   2:58 PM IST
Share on:
‘సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ లుక్...

చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ జోరు పెంచిన సంగతి విదితమే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా, నభా నటేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’... ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి ‘హ్యాపీ సింగిల్స్ డే’ అంటూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సింగిల్ ఆర్మీ, హ్యాపీ సింగిల్స్ డే.. ఎప్పుడైనా, ఎక్కడైనా సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సుప్రీం హీరో..అంతేకాక సాయి ధరమ్ తేజ్ హీరోగా, యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు నిర్మాణంలో భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు వంటి హిట్ చిత్రాల డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’, ఈ చిత్రంలో  సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా జంటగా నటిస్తుండగా ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. 
 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ రిలీజ్...
‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ రిలీజ్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.