(Local) Wed, 28 Jul, 2021

చైతూ బర్త్‌డే.. సామ్‌ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌

November 23, 2019,   7:25 PM IST
Share on:
చైతూ బర్త్‌డే.. సామ్‌ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ కపుల్ ఎవరు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది నాగచైతన్య-సమంత. ఈ ముచ్చటైన జంట మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అభిమానులు సైతం మురిసిపోతుంటారు.....టాలీవుడ్ లో సక్సెస్‌ ఫుల్‌ హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య ఈ రోజు 33వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు, అక్కినేని ఫ్యాన్స్‌ నాగచైతన్యకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. ఇక తన భర్త నాగచైతన్యకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ సమంత హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌ చేసింది.

సమంత ఇన్‌స్టా వేదికగా నాగచైతన్యతో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ విషెస్‌ తెలిపింది. ‘నా చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు సంతోషంగా ఉండాలని నేను ప్రతిరోజూ ప్రార్థిస్తుంటాను. గడిచిపోతున్న రోజును చూసి నేను ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఎందుకంటే నీ బెస్ట్‌ వెర్షన్‌గా నువ్వు ఎదుగుతున్నావు. మనమిద్దరం ఒకటిగా ఉంటే మరింత స్ట్రాంగ్‌గా ఉంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్‌యూ డార్లింగ్‌ హస్బెండ్.’ అని సమంత పోస్ట్‌ పెట్టారు.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  కాగా సమంత షేర్‌ చేసిన ఫొటోలు చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ పోస్ట్‌పై స్పందించారు. చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నాకెంతో ఇష్టమైన జంట’ అని రకుల్‌ అన్నారు. నందినిరెడ్డి, స్వప్నాదత్‌లు.. చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
నాగచైతన్య ‘ఎన్‌సి 19’ నుండి గ్లిమ్ప్స్ రిలీజ్...
నాగచైతన్య ‘ఎన్‌సి 19’ నుండి గ్లిమ్ప్స్ రిలీజ్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.