(Local) Mon, 26 Aug, 2019

మహేశ్ పుట్టినరోజు కానుకగా…’సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో విడుదల!

August 09, 2019,   1:26 PM IST
Share on:

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే అయన అభిమానులకి పండుగే అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ప్రిన్స్ ఫాన్స్ నాలుగు రోజుల ముందే మహేష్ బర్తడే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ ఫాన్స్ ఆల్రెడీ ఓ స్పెషల్ పోస్టర్ తయారుచేసి యాష్ టాగ్ పెట్టి ట్రేండింగ్ కూడా స్టార్ట్ చేసారు. ఇది ఇలా ఉంటే మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకొని చిత్ర యూనిట్ 'సరిలేరు నీకెవ్వరు’  చిత్రం నుండి ఒక ఇంట్రో ని విడుదల చేసారు. ఇంతవరకూ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌ల పేరిట కొత్త సినిమాల ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తారు. కానీ సరిలేరు నీకెవ్వరూ చ్చిత్ర బృందం సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఇంట్రో పేరుతో ఈ సినిమాకు సంబందించిన వీడియోను విడుదల చేసింది. టీజర్ లో మహేశ్‌ ఆర్మీ ఆఫీసర్ అజయ్‌కృష్ణగా కనిపిస్తున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ సాగిన నేపధ్య  సాంగ్‌ ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

సంబంధిత వర్గం

ఊపిరితిత్తులు కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నా సూ ...
ప్రారంభమైన సూప‌ర్ స్టార్ ”ది హంబుల్ కో”......

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.