(Local) Sun, 25 Jul, 2021

బిగ్ బి, ఆయుష్మాన్ లుక్ చూసారా..?

October 31, 2019,   6:07 PM IST
Share on:
బిగ్ బి, ఆయుష్మాన్ లుక్ చూసారా..?

బాలీవుడ్ లో విభిన్న కథాంశంతో కూడిన చిత్రాల్లో నటిస్తూ మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్న హీరో ఆయుష్మాన్ ఖురాన. అతి తక్కువ సినిమాలతో అభిమానుల మదిలో స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షుకుల ముందుకురానున్నాడు. షూజీత్ సర్కార్ దర్శకత్వంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'గులాబో సితాబో'. ఇదివరకే ఈ చిత్రం నుండి చిత్రయూనిట్ బిగ్ బి లుక్ రిలీజ్ చేయగా, తాజాగా మరో వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసింది.

ఈ వర్కింగ్ స్టిల్స్ లో అమితాబ్ తెల్ల పైజామాపై పచ్చ రంగు కుర్తాతో కనిపిస్తున్నాడు. కళ్ల జోడు, నెరిసిన గడ్డంతో చూడగానే గుర్తు పట్టలేనంత మేకవర్ తో అమితాబ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. పైగా గులాబో సితాబో సినిమాలో అమితాబ్ బాగా డబ్బున కోపిష్టి హౌస్ ఓనర్‌ పాత్ర చేస్తున్నాడు. అలాంటి భూస్వామిగా ఇలాంటి గెటప్ లో ఉండడం ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావట్లేదు. అమితాబ్ పక్కనే నిలబడిన ఆయుష్మాన్ కూడా తెల్ల పైజామా, గీతల చొక్కాతో మామూలు సాధాసీదా కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు ఇంత నార్మల్ గా ఉండడానికి కారణం ఏంటి అనేది గులాబో సితాబో సినిమాలోనే చూడాలి. ఇప్పటికైతే ఈ వర్కింగ్ స్టిల్ చూసిన వాళ్లు మాత్రం అమితాబ్ అండ్ ఆయుష్మాన్ ఖురానా న్యూ మేకోవర్ చూసి షాక్ అవ్వడమే కాకుండా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు.  ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకున్నారు. 

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....
దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.