(Local) Tue, 02 Mar, 2021

దీపావళి కానుక ఇవ్వబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’

October 21, 2019,   2:08 PM IST
Share on:
దీపావళి కానుక ఇవ్వబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా '‘సరిలేరు నీకెవ్వరు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్‌ మహేశ్‌బాబు సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఇదివరకే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఇంట్రో టీజర్ అందరిని మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రయూనిట్ దసరా కానుకగా మహేష్ లుక్ రి రిలీజ్ చేసిన లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  
అదేవిధంగా చిత్రయూనిట్ దీపావళికి ట్రీట్‌ ఇవ్వడానికి సిద్ధం అయింది. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు అనిల్‌ రావిపూడి సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి ఓ ప్రత్యేక పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా అనిల్‌ పోస్ట్‌ చేశారు. ‘విలన్‌ హౌస్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి దీపావళి ట్రీట్‌ కోసం రెడీగా ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.