(Local) Fri, 26 Feb, 2021

నాని కలుసుకునే అవకాశం కావాలా ---ఐతే ఇలా చేయండి.....

August 21, 2019,   4:55 PM IST
Share on:
నాని కలుసుకునే అవకాశం కావాలా ---ఐతే ఇలా చేయండి.... ...

చిత్రసీమలో కొత్త సినిమా వస్తోంది అంటేనే ఆ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అని మోషన్ పోస్టర్, గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్, సింగల్ అంటూ...సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుండటం చూస్తూనే ఉంటాం. తాజాగా నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 'గ్యాంగ్ లీడర్' సినిమా ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన "హోయినా.. హోయినా" పాట కూడా మంచి రెస్పాన్స్ పట్టేసింది. దాంతో చిత్ర యూనిట్ ఈ పాటపై ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఏదైనా ట్రావెల్ చేస్తూ అది కార్ కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణిస్తూ ఎవరైనా సరే ఈ లిరిక్ ని హమ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తనకి లింక్ చేయమన్నాడు..ఇంతకీ ఇదంతా ఎందుకా అనుకుంటున్నారా..? గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తన ఫ్యాన్స్ కోసం ఈ సాంగ్ ని పాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సాంగ్ ఛాలెంజ్ అంటూ ఇప్పుడు అందరూ ఈ పాటని హమ్ చేస్తూ తెగ వీడియోలు చేసేస్తున్నారు. 
ఇలా వచ్చిన వీడియోల్లో ద బెస్ట్ వీడియో చేసిన వాళ్లని నాని ప్రత్యేకంగా కలుస్తాడట. అంతేకాదు, సినిమా యూనిట్ తో కలిసి సినిమా చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాడు.ఇప్పుడు నాని చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నారు.

సంబంధిత వర్గం
హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
మళ్ళి సీక్వెల్ లో రాబోతున్న అ! ప్ర‌యోగాత్మ‌క చిత్ర ...
మళ్ళి సీక్వెల్ లో రాబోతున్న అ! ప్ర‌యోగాత్మ‌క చిత్ర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.