(Local) Sun, 16 Feb, 2020

బాలయ్య 105వ సినిమా టైటిల్ ప్రముఖ టీవీ ఛానల్....

October 16, 2019,   4:54 PM IST
Share on:
బాలయ్య 105వ సినిమా టైటిల్ ప్రముఖ టీవీ ఛానల్....

నందమూరి బాలయ్య తెలుగువారి ఆరాథ్య నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు బయోపిక్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ తర్వాత నందమూరి ఫాన్స్ బాలయ్య బాబు ఎటువంటి మూవీలో నటిస్తారో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా తరుణంలో కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభమైంది. ఈ మూవీలో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. బాలయ్య న్యూ లుక్ పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే బాలయ్య 105వ చిత్రానికి ఇంకా టైటిల్ ప్రకటించని సంగతి తెలిసిందే. కాగా తాజాగా బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కాంబోలో షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు. బాలయ్య కొత్త చిత్రం టైటిల్ 'రూలర్' అని జెమిని టివి వారు ఓ పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేసి షాకిచ్చింది. అంతేకాకుండా ఈ పోస్టర్ ద్వారా రూలర్ శాటిలైట్ హక్కులను తాము సొంతం చేసుకున్నట్లుగా తెలియజేసారు. దసరా కానుకగా బాలకృష్ణ కొత్త చిత్ర టైటిల్ కోసం ఎదురు చూసిన బాలయ్య అభిమానులు.. జెమిని టివి ఆఫీసియల్ ట్విట్టర్ లో ఇలా ఎలాంటి చడి చప్పుడు లేకుండా టైటిల్ ని ప్రకటించేసారు. మరి ఇదెంత వరకు నిజమో చూడాలి... 

సంబంధిత వర్గం
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.