(Local) Mon, 27 Sep, 2021

‘పానిపట్’ క్యారెక్టర్స్ పోస్టర్స్ రిలీజ్...

November 04, 2019,   5:18 PM IST
Share on:
‘పానిపట్’ క్యారెక్టర్స్ పోస్టర్స్ రిలీజ్...

వెండితెరపై వైవిధ్యమైన కథలను ఆవిష్కరించడానికి ఈ మధ్య దర్శక... నిర్మాతలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అంతేకాక పూర్వం చోటు చేసుకున్న అపూర్వ ఘట్టాలను ప్రేక్షకుల ముందుంచేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా పానిపట్ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా రాబోతోంది. ‘పానిపట్’ అనే పేరుతో రాబోతున్న ఈ సినిమా అశుతోష్‌ గోవారీకర్‌ దర్శకత్వంలో రూపొందనుంది. చిత్రంలో సంజయ్ దత్, కృతి సనన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని విజన్ వరల్డ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ‘పానిపట్’ సినిమా నుంచి క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేసింది టీమ్...పోస్టర్స్ లో.... సంజయ్‌ దత్‌ ‘అహ్మద్‌ షా అబ్దాలీ’ పాత్రలో నటిస్తున్నారు.. సంజూ భాయ్ లుక్ ఆకట్టుకుంటుంది. కృతి సనన్ తన లుక్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది.. ఆమె ‘పార్వతీ బాయి’ క్యారెక్టర్ చేస్తుంది. అర్జున్ కపూర్ మరాఠా నాయకుడు ‘సదాశివ రావు బాహు’ పాత్రలో నటిస్తున్నాడు.. అతని లుక్ కూడా రివీల్ చేశారు. ఈ ‘పానిపట్’ పీరియాడికల్‌ మూవీ ట్రైలర్ ను నవంబర్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్‌-అతుల్‌ సంగీతాన్ని అందించగా ఈ సినిమా డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత వర్గం
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....
హాట్‌ సిల్వర్‌ ఔట్‌ ఫిట్ లో మ‌లైకా...బర్త్ డే
హాట్‌ సిల్వర్‌ ఔట్‌ ఫిట్ లో మ‌లైకా...బర్త్ డే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.