(Local) Wed, 20 Oct, 2021

49 సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు..!

October 05, 2019,   12:45 PM IST
Share on:
49 సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు..!

సెలబ్రిటీస్ పై అప్పుడప్పుడు ఎదో ఒక విషయంలో ఎవరో ఒకరు కేసు ఫైల్ చేయడం లాంటి సంఘటనలు వింటూనే ఉంటాం...కానీ తాజాగా ఒకేసారి సినీ రంగానికి చెందిన 49 మందిపై దేశద్రోహం కేసు నమోదవ్వడం షాక్ కి గురిచేస్తోంది. ఇది నిజం...ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో సహా 49మంది సినీ సెలెబ్రిటీలపై దేశద్రోహం కేసు నమోదైంది. 3 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, మోబ్ లించింగ్ పెరిగిపోతున్నాయంటూ.. అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అపర్ణాసేన్, అనురాగ్ కశ్యప్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ సహా మొత్తం 49మంది సెలెబ్రిటీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఈ లేఖ సంచలనం స‌ృష్టించింది. ఈ లేఖ వెనుక వామపక్ష భావజాల ప్రభావం వుందని, కమ్యూనిస్టు భావజాలంతోనే వారంతా మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నించారని మరో 62 మంది సెలెబ్రిటీలు ఎదురు దాడి చేశారు. తాజాగా ఈ అంశం మళ్ళీ తెరపైకొచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకే 50 మంది సెలెబ్రిటీలు ప్రయత్నించారంటూ కొంత మంది బీహార్‌లోని ముజఫర్ నగర్ కోర్టుని ఆశ్రయించారు. దాంతో మణిరత్నంతో సహా 49మంది సెలెబ్రిటీలపై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయాలని ముజఫర్‌నగర్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ముజఫర్ నగర్‌కు చెందిన న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా రెండు నెలల క్రితం ఫైల్ చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 50 మంది సెలెబ్రిటీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
త్వరలో పట్టాలెక్కనున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్
త్వరలో పట్టాలెక్కనున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.