(Local) Sun, 25 Oct, 2020

'సైరా' ని సొంతం చేసుకున్నా ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్.....

August 14, 2019,   7:22 PM IST
Share on:
'సైరా' ని సొంతం చేసుకున్నా ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ ...

ఈ మధ్య చిత్ర సీమలో మరో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అది...సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే మాటని పక్కన పెడితే, ఆ సినిమా ఎన్ని బాషలలో విదుదల చేయబోతున్నారో తెలుసుకుని వాటికీ సంబందించిన హక్కులను ముందే సొంతం చేసుకోవటానికి ఈ మధ్య చాల మంది పోటీ పడటం చూస్తూనే ఉన్నాం. అదే కోవలో ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్ర సైరా హిందీలో కూడా విడుదల కానున్నది. ఈ హిందీ చిత్రం పంపిణీ హక్కులను ఫర్హాన్ అక్తర్, రితీష్ సిధ్వానీకి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అనిల్ తడానీకి చెందిన ఎఎ ఫిల్మ్ సొంతం చేసుకుంది. అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో తొలిసారి తెలుగులో నటిస్తున్న ఈ చిత్రంలో కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితర ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన తారాగణాన్ని పరిచయం చేసే ఒక కొత్త వీడియోను హిందీ నిర్మాతలు విడుదల చేశారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంపిణీ చేస్తున్న రెండవ దక్షిణాది సినిమా సైరా నరసింహారెడ్డి. యశ్ నటించిన కెజిఎఫ్ చిత్రం హిందీ వర్షెన్‌ను ఈ సంస్థే పంపిణీ చేసింది.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.