(Local) Mon, 27 Sep, 2021

బెజవాడలో సందడి చేసిన సూపర్ స్టార్...

October 14, 2019,   1:05 PM IST
Share on:
బెజవాడలో సందడి చేసిన సూపర్ స్టార్...

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడని తెలిసిందే. అయితే ఇంత బిజీగా ఉన్నపటికీ మహేషే విజయవాడలో తన అభిమానులకి కనిపించి సందడి చేసారు. వివరాల్లోకి వెళితే...ఆదివారంనాడు సూపర్ స్టార్ భీమ ఆభరణాల షోరూంను ప్రారంభించడానికి విజయవాడ చేసురుకున్నారు. మహాత్మాగాంధీ రోడ్డులో నూనతంగా ఏర్పాటు చేసిన భీమా ఆభరణాల షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలి షోరూమ్‌ను ఏర్పాటు చేసిన భీమ జ్యువెల్లర్స్‌ యాజమాన్యానికి మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ విజయవాడతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. బెజవాడ రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. విజయవాడ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తనకు సంబంధించిన ఎక్కువ సినిమాలు ఇక్కడే 100 రోజుల వేడుకలు జరిగాయని గుర్తుచేసుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12న విడుదల కాబోతున్న తన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. మహేశ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.