(Local) Wed, 20 Oct, 2021

‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’....వర్మ

November 25, 2019,   2:49 PM IST
Share on:
‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’....వర్మ

టాలీవుడ్ క్రేజి వివాదాల వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తర్వాత ఆంద్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ మార్పులను బేస్ చేసుకొని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ ఓ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నవంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రెండు ట్రైలర్లలోని సన్నివేశాలు జనాలకు, రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చాయి. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే వర్మ మరో అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించాడు. గతంలో మియా మాల్కోవా ప్రధానపాత్రలో ‘జీఎస్టీ’ అనే సినిమా తీసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ పేరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా టీజర్‌ను బ్రూస్ లీ జయంతి రోజైన ఈనెల 27 వ తేదీన సాయంత్రం 3:12 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను వచ్చే నెల డిసెంబర్ 13 వ తేదీన బ్రూస్ లీ సొంత నగరమైన చైనాలోని ఫోషన్ సిటిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్‌లో సినిమాను నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
శ్రీనివాస‌రెడ్డిని మెచ్చిన జక్కన్న....
శ్రీనివాస‌రెడ్డిని మెచ్చిన జక్కన్న....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.