(Local) Mon, 27 Sep, 2021

లేడీ ఓరియంటెడ్ లో......ఈషా రెబ్బ

October 13, 2019,   10:30 PM IST
Share on:
లేడీ ఓరియంటెడ్ లో......ఈషా రెబ్బ

2013లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన "అంతకు ముందు ఆ తర్వాత" మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన ఈషా రెబ్బ. ఆ తర్వాత బందిపోటు, అమీ తుమీ, అ చిత్రాల్లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈషా రెబ్బ కెరీర్ లోనే లేడీ ఓరియంటెడ్ మూవీలో "24 గంటల్లో" కనిపించబోతోంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్, ముస్కాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన స్టిల్ లో సంప్రదాయమైన లుక్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు ఈషా రెబ్బా. కెరీర్ లోనే ఇషా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. కచ్చితంగా ప్రేక్షకుల నుంచి ఈమెకు అద్భుతమైన స్పందన వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. రఘు కుంచె రాగల 24 గంటల్లో సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శ్రీ నవహాస్ క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ రాగల 24 గంటల్లో సినిమాను సమర్పిస్తోంది.

సంబంధిత వర్గం
రివ్యూ: రాగాల 24 గంటల్లో
రివ్యూ: రాగాల 24 గంటల్లో
త్రివిక్రమ్ చేతుల మీదుగా 'రాగల 24 గంటల్లో'...
త్రివిక్రమ్ చేతుల మీదుగా 'రాగల 24 గంటల్లో'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.