(Local) Wed, 21 Apr, 2021

47 ఏళ్లు వయసులో రెండో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ హీరో రాక్...

August 21, 2019,   11:31 AM IST
Share on:
47 ఏళ్లు వయసులో రెండో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ హీ ...

హాలివుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) చూసేవాళ్లకు ‘ది రాక్‌’గా ఆయన సుపరిచితుడు. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా, ‘ది రాక్‌’ రింగులోకి అడుగు పెట్టాడంటే ఎదుటి వ్యక్తి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. నటుడిగా మారిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ  నుంచి  దూరమైన డ్వేన్‌ జాన్సన్‌ ఇక ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. రెజ్లింగ్ స్టార్ గా ఒకప్పుడు రాక్ అని అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకున్న డ్వేన్ స్కార్పియన్ కింగ్, ది మమ్మీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ , జూమాంజి వంటి బాక్స్ ఆఫీస్ సినిమాల ద్వారా తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకున్న ఈ 47 ఏళ్ల కండల వీరుడు మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న డ్వేన్ జాన్సన్ ఆగస్ట్ 18న తన ప్రియురాలు లారెన్ హాషియాన్ ను హవాయ్ దీవుల్లో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జాన్సన్ బహిర్గతం చేశాడు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో తన రెండవ భార్యతో సంతోషంగా పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. 2006లో ‘ది గేమ్‌ ప్లాన్’ సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2007లో జాన్సన్‌ తన మొదటి భార్య డానీ గార్సియాకు విడాకులు ఇచ్చారు. మొదటి భార్య డానీ గార్సియా,  డ్వేన్ జాన్సన్ కి 18 సంవత్సరాల కూతురు కూడా ఉంది. 

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మెగాస్టార్  కొత్త లుక్‌ ...
మెగాస్టార్  కొత్త లుక్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.