(Local) Mon, 27 Sep, 2021

హాలీవుడ్ డైరెక్టర్ మనసు దోచుకున్న....బాహుబలి

August 09, 2019,   2:14 PM IST
Share on:
హాలీవుడ్ డైరెక్టర్ మనసు దోచుకున్న....బాహుబలి

దర్శక ధీరుడు జక్కన్న నిర్మించిన  ‘బాహుబలి’ చిత్ర విడుదలై రెండేళ్లు గడిచిన, ఇంకా ఆ సినిమాపైనే ప్రశంసలు రావడం అనేది అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా సత్తాకి గుర్తింపు అనే చెప్పుకోవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాయడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్కాట్ డెరిక్సన్ బాహుబలి చిత్రం గురించి ట్వీట్ చేశాడు. ఓ నెటిజన్ బాహుబలి చిత్ర వీడియోని షేర్ చేయగా దానిని డెరిక్సన్ ట్వీట్ చేశాడు. బాహుబలి 2లో క్లైమాక్స్ లో ప్రభాస్ మాహిష్మతి కోటలోకి ప్రవేశించే సీన్ హైలైట్. ప్రభాస్, సత్యరాజ్, మరికొందరు సైనికులు కలసి తాటి చెట్టుపై నుంచి కోటలోకి దూకుతారు. ఇలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని తానింతవరకు చూడలేదు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీని గురించి స్కాట్ డెరిక్సన్ ట్వీట్ చేస్తూ.. ఇది ఊపిరి బిగబట్టుకునే సన్నివేశం.. ఇండియన్ బాహుబలి అని కామెంట్ చేశాడు.

సంబంధిత వర్గం
శ్రీనివాస‌రెడ్డిని మెచ్చిన జక్కన్న....
శ్రీనివాస‌రెడ్డిని మెచ్చిన జక్కన్న....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.