(Local) Wed, 02 Dec, 2020

చిరు డైరెక్టర్‌ కు పూరి సాయం...

November 21, 2019,   2:38 PM IST
Share on:
చిరు డైరెక్టర్‌ కు పూరి సాయం...

టాలీవుడ్ సెన్సషనల్ డైరెక్టర్ గా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే టెంపర్ చిత్రం తర్వాత హీరో రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తెరకెక్కించి సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ ని సొంతం చేసుకోవటం మాత్రమే కాకుండా కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది. ఈ చిత్ర విజయోత్సహంతో డైరెక్టర్ పూరి సెప్టెంబర్‌ 28న తన పుట్టినరోజు సందర్భంగా దర్శకత్వ విభాగంలో 30 మంది సభ్యులకు 50 వేల చొప్పున 15 లక్షలు సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడికి రూ.50వేల ఆర్థిక సాయం చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’కు దర్శకత్వం వహించిన గూడపాటి రాజ్‌కుమార్‌ ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడి వైద్య ఖర్చులకు కూడా భారమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. కాశీవిశ్వనాథ్‌ రూ.5 వేలు, మెహర్‌ రమేష్‌ రూ.10 వేల చొప్పున ఆయనకు ఆర్థిక సహాయం అందించారు. ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి రూ.41వేలు అందజేయాగా.. ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు. బుధవారం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ రూ.50 వేలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. దీంతో ‘దటీజ్‌ పూరి’ అంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. సినీ ప్రముఖు చేస్తున్న సహాయానికి రాజ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.