(Local) Sat, 24 Jul, 2021

ఎన్టీఆర్ నాకు కాల్ చేసేవారు...అట్లీ

October 23, 2019,   7:12 PM IST
Share on:
ఎన్టీఆర్ నాకు కాల్ చేసేవారు...అట్లీ

 ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ కుమార్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బిగిల్'. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'విజిల్' పేరుతో నిర్మాత మహేష్ ఎస్ కోనేరు, ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ కాగా ఇళయదళపతి రాజప్ప, మైఖేల్‌గా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా ఈనెల 25వ తేదీన తెలుగు మరియు తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో ఎంతో వేడుకగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం హీరో విజయ్ అన్నే అని, ఆయనతో సినిమా చేసిన ప్రతిసారి తనకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని అన్నారు. ఇక తెలుగులో తనకు జూనియర్ ఎన్టీఆర్ గారంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని, తన ప్రతి సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ గారు ఆ సినిమా చూసి కాల్ చేసి, సినిమా అద్భుతంగా ఉందని ఎంతో ప్రేమతో మాట్లాడి నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేవారని అన్నారు. విజయ్ అన్న మరియు తన కాంబినేషన్లో వస్తున్న ఈ మూడవ సినిమా, గత రెండు సినిమాల మాదిరిగానే మంచి విజయాన్ని అందుకుంటుందని అట్లీ అన్నారు. బిగిల్ తరువాత షారుక్ ఖాన్ తో అట్లీ ఒక సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి…..!

సంబంధిత వర్గం
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
RRR అప్ డేట్ పై మండిపడుతున్న ఫ్యాన్స్...
RRR అప్ డేట్ పై మండిపడుతున్న ఫ్యాన్స్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.