(Local) Sat, 24 Jul, 2021

ప్ర‌స్థానం నుండి "దిల్ ద‌రియాన్" సాంగ్....

September 10, 2019,   1:18 PM IST
Share on:
ప్ర‌స్థానం నుండి

టాలీవుడ్ లో 2010లో దేవ కట్టా దర్శకత్వంలో సాయి కుమార్, శ్వరానంద్, సుందీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ప్రస్థానం. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా ఈ  సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసి హిందీలోను అదే పేరుతో దేవాక‌ట్ట‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ దేవాకట్ట పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా "దిల్ ద‌రియాన్" అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్. ఇందులో అలీ ఫాజ‌ల్‌, అమైరా ద‌స్తూర్‌ల రొమాన్స్ అదిరిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. చిత్రంలో సంజ‌య్ ద‌త్‌, మ‌నీషా కోయిరాల‌, అమైరా ద‌స్తూర్‌, అలీ ఫాజ‌ల్, స‌త్య‌జిత్ దుబే, చుంకీ పాండే ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. రీమేక్‌లో సాయికుమార్ పాత్ర‌ని సంజయ్ దత్, శ‌ర్వానంద్ పాత్రని అలీ ఫాజ‌ల్‌ పోషిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
‘ప్రస్థానం’ ట్రైలర్ విడుదలైంది.....
‘ప్రస్థానం’ ట్రైలర్ విడుదలైంది.....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.