(Local) Tue, 27 Oct, 2020

‘హోటల్ ముంబాయి’ ట్రైలర్ రిలీజ్....

October 23, 2019,   7:57 PM IST
Share on:
‘హోటల్ ముంబాయి’ ట్రైలర్ రిలీజ్....

థండర్ రోడ్ పిక్చర్స్, ఆర్క్‌లైట్ ఫిలింస్, ఎలక్ట్రిక్ పిక్చర్స్, క్సెయిట్‌గిస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ సంస్థల నిర్మాణంలో ఆంథోని మారస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హోటల్ ముంబాయి’. ఈ మూవీలో దేవ్ పటేల్ అనుపమ్ ఖేర్, ఆర్మీ హ్యామర్, నజానిన్ బొనియాడి, నగేష్ బోస్లే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదివరకే ‘స్లమ్ డాగ్ మిలీనియర్’తో కెరీర్ స్టార్ట్ చేసి, ‘అబౌట్ చెర్రీ,’ ‘ది రోడ్ వితిన్’, ‘ఓన్లీ ఎస్టర్‌డే’, ‘లయన్’, ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
ఈ సినిమా 2008లో ముంబాయి తాజ్ మహల్ హోటల్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ‘సర్వైవింగ్ ముంబాయి’ అనే డాక్యుమెంటరీ ఆధారంగా, ఆస్ట్రేలియన్ - అమెరికన్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్‌గా రూపొందింది ‘హోటల్ ముంబాయి’.. రూపొందించారు. ‘టొరెంటో ఇంటర్‌నేషనల్ ఫిలిం ఫెస్టివల్’, ‘ఆడిలైడ్ ఫిలిం ఫెస్టివల్’‌లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. ఇక ఇప్పుడు ఇండియాలో విడుదల చేయనున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి వోకర్ బెర్టెల్‌మన్ సంగీతాని అందించారు. ఈ ‘హోటల్ ముంబాయి’ చిత్రం నవంబర్ 29న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో  రిలీజ్ కానుంది. 

సంబంధిత వర్గం
ప్రపంచ రికార్డ్: 1 బిలియన్ డాలర్లు వైపు పరుగెడుతున ...
ప్రపంచ రికార్డ్: 1 బిలియన్ డాలర్లు వైపు పరుగెడుతున ...
నేను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో సమావేశం కాలేదు
నేను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో సమావేశం కాలేదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.