(Local) Wed, 23 Sep, 2020

మహర్షి మూవీ నుండి తొలగించిన సన్నివేశం.....

August 17, 2019,   2:35 PM IST
Share on:
మహర్షి మూవీ నుండి తొలగించిన సన్నివేశం.....

చిత్రసీమ అనడంలోనే విచిత్రం దాగి ఉంది. అదే విధంగా ఈ మధ్య దర్శక, నిర్మాతలు కొత్త మూవీ వస్తోంది అంటే చాలు ప్రమేషన్స్ లో భాగంగా గ్లిమ్ప్స్, టీజర్, ఇంట్రో, ట్రైలర్ అంటూ మూవీకి సంబంధించి ప్రమేషన్స్ చేస్తూ ఉంటారు. మూవీ వవిడుదలయ్యాక కొద్దీ రోజులు మాములుగానే ఉన్న ఆ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో ఆ మూవీ కి సంబంధించి తొలగించిన సీన్స్ అంటూ ఆ మూవీకి సంబందించిన సన్నివేశాలు రిలీజ్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా  మ‌హేష్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వంశీపైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌ర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌హ‌ర్షి చిత్రం రీసెంట్‌గా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా చిత్రం నుండి డిలీటెడ్ సీన్‌కి సంబంధించిన వీడియో విడుద‌ల చేశారు. బీజీఎమ్ లేకుండా సాగే ఓ సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. కాలేజ్ క్యాంపస్ లో మహేష్ కి మరో విద్యార్థికి మధ్య చిన్న సంఘర్షణ, ఇద్దరిని ప్రిన్సిపాల్ మందలించే సన్నివేశానికి సంబందించిన వీడియోని విడుదల చేశారు. 

సంబంధిత వర్గం
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.