(Local) Mon, 12 Apr, 2021

రజినీకాంత్ ‘దర్బార్’ న్యూ పోస్టర్....

October 29, 2019,   4:23 PM IST
Share on:
రజినీకాంత్ ‘దర్బార్’ న్యూ పోస్టర్....

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.o, పేట చిత్రాల తర్వాత నటిస్తున్న మూవీ దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభాస్కరన్ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ మూవీలో సూపర్ స్టార్ రజిని సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ మూవీలో రజినీకాంత్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడబోతున్నారు. తాజాగా దర్బార్ చిత్ర యూనిట్ దీపావళి పండుగను పురస్కరించుకుని రజినీకాంత్ స్టైలిష్ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. రజినికాంత్ గన్ పట్టుకుని స్టైలిష్ గా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్టర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. సంతోష్ శివన్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది…!!

సంబంధిత వర్గం
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..
సీనియర్‌ హీరోయిన్‌ తో తలైవర్ రొమాన్స్‌..
రజినీతో నటించాలనుంది: కాజల్
రజినీతో నటించాలనుంది: కాజల్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.