(Local) Sun, 20 Oct, 2019

ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన....రాజ్ తరుణ్

August 21, 2019,   1:01 PM IST
Share on:
ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన....రాజ్ తరు ...

ఈ మధ్యకాలంలో అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. నార్సింగ్ సమీపంలో  అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారు జామున కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆ కారు తరుణ్ లేక రాజ్ తరుణ్ అని పేరు రావడంతో కన్ఫ్యూజన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. పేర్లు ఒకటే కావడంతో ఈ కన్ఫ్యూజన్ గోల మొదలయి మీడియాలో రచ్చ స్టార్ట్ అయింది.  ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఆ కారు  హీరో రాజ్ తరుణ్ అని తెలిసాక ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా నార్సింగి రోడ్డు ప్రమాదంపై రాజ్ తరుణ్ స్పందించాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని ట్విటర్ వేదికగా చెప్పాడు. తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది ఫోన్లు చేస్తున్నారనీ, ఇంతమంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని పేర్కొన్నాడు. ‘నార్సింగి సర్కిల్‌కు రాగానే కారు కుడివైపు మలుపు తీసుకోవాల్సి వచ్చింది. కారు మలిపే క్రమంలో అదుపు తప్పింది. ఒక్కసారిగా వెళ్లి పక్కనే వున్న గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి నా చెవులు పనిచేయలేవు. చూపు కూడా కోల్పోయినట్టు అనిపించింది. గుండెలో దడ పెరిగింది. నేనప్పుడు సీటు బెల్టు ధరించే వున్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీరు నాపట్ల చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇంకొక విషయం చెబుతున్నా.. సీటు బెల్టే ప్రమాదం నుంచి నన్ను కాపాడింది. సీటు బెల్టు అందరూ ధరించాలి’ అని రాజ్ తరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. నార్సింగి సర్కిల్‌లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయని రాజ్ తరుణ్ గుర్తుచేశాడు. 

సంబంధిత వర్గం
స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలా ???
స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలా ???

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.