(Local) Mon, 16 Sep, 2019

మరి కొద్ది నిమిషాల‌లో మెగా ఫాన్స్ కి ట్రీట్....

August 20, 2019,   12:06 PM IST
Views: 95
Share on:
మరి కొద్ది నిమిషాల‌లో మెగా ఫాన్స్ కి ట్రీట్....

టాలీవుడ్ నుండి మొదలుకొని బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ వరకు బడా స్టార్స్ అందరు ఒక తెరమీద కలిసి కనువిందు చేయబోతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, నయనతార కథానాయికగా కనిపిస్తున్నారు.  ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవ‌ల పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మెగాస్టార్ బ‌ర్త్‌డే (ఆగ‌స్ట్ 22) సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ని ఈ రోజు ఆగష్టు 20న మ‌ధ్యాహ్నాం 2.40 ని.ల‌కి విడుద‌ల చేయన్నున్నట్లు ట్విట్టర్ వేదికగా సైరా చిత్ర యూనిట్ తెలియజేసింది.  ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతుంద‌ని  ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, తమన్నా వంటి టాప్ స్టార్స్ నటిస్తుండటం మరింత విశేషం. 

సంబంధిత వర్గం
సైరా లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎంత ఖర్చయిందో తెలుసా....
సైరా లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎంత ఖర్చయిందో తెలుసా....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.