(Local) Tue, 24 Nov, 2020

తొలితరం స్వాతంత్ర  సమరయోధుడి 'సైరా' మేకింగ్ వీడియో....

August 14, 2019,   4:21 PM IST
Share on:
తొలితరం స్వాతంత్ర  సమరయోధుడి 'సైరా' మేకింగ్ వీడియో ...

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా.. సైరా నరసింహారెడ్డి.. తొలితరం స్వాతంత్ర  సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో.. తెరకెక్కించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం  సైరా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.

సైరా సెట్ దగ్గరి నుంచి, వివిధ లొకేషన్స్‌లో జరిపిన షూటింగ్ విజువల్స్‌తో పాటు, సైరాలో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటుల గెటప్స్‌ను కూడా రివీల్ చేశారు. మేకింగ్ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ చోట అమితాబ్‌తో కలిసి కనిపించాడు. మెగా డాటర్ నిహారిక కూడా సైరాలో నటిస్తుంది. సైరా మేకింగ్ వీడియో మెగాభిమానులను అలరిస్తుంది. ఈ వీడియోలో  మెగాస్టార్ లుక్ తో పాటు యుద్దాలు..అమితాబ్..నయనతార..కిచ్చ సుదీప్...విజయ్ సేతుపతి...తమన్నాల గెటప్ లను కూడా చూపించారు. మొత్తానికి మేకింగ్ వీడియో..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.  ఈ మూవీ కోసం ప‌లువురు హాలీవుడ్ నిపుణులు కూడా ప‌ని చేశారు. ప్రస్తుతం 10 దేశాల్లో 26 ప్రదేశాల్లో సైరా విజువల్ ఎఫెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 20న సైరా టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. త్వరలో సైరా టీమ్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చెయ్యనుంది.

సంబంధిత వర్గం
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.