(Local) Mon, 12 Apr, 2021

మెగాస్టార్, కొరటాల చిత్రం... ప్రారంభం

October 08, 2019,   5:20 PM IST
Share on:
మెగాస్టార్, కొరటాల చిత్రం... ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి టైమ్ పట్టింది కానీ...ఖైదీ నెంబర్ 150 తర్వాత కొణిదెల ప్రొడక్షన్స్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ చిత్రం సైరా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్‌, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 152వ చిత్రమది.  డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి అంజనా దేవి, సురేఖ, సుస్మిత, చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ, తిరు, నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డి.వి.వి.దానయ్య, జెమిని కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.