(Local) Sat, 24 Jul, 2021

ఆలోచనలో పడ్డ మెగాస్టార్.....

October 17, 2019,   3:22 PM IST
Share on:
ఆలోచనలో పడ్డ మెగాస్టార్.....

మోలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్‌‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసీఫ‌ర్ ' మూవీ బాక్స్ ఆఫీస్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి మెగా తనయుడు రామ్ చరణ్  రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ లూసీఫ‌ర్ రీమేక్ విష‌యంలో చిరంజీవి పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాని చిరంజీవి డైరెక్ట్ గా కొనలేదు. తనకు సినిమా బాగా నచ్చిందని ఆ విషయాన్నీ ఎన్వీ ప్ర‌సాద్‌లో చ‌ర్చిస్తుంటే.. ఆయ‌న ఆఘ‌మేఘాల మీద `లూసీఫ‌ర్` రీమేక్ రైట్స్ కొనుక్కొచ్చేశారట. మన తెలుగు లో ఈ సినిమాను రీమేక్ చేస్తే కచ్చితంగా చాలా మార్పులు చేయాల్సి వస్తుంది. లేదంటే మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఏమాత్రం ఇలాంటి సినిమాలు నచ్చవు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ కూడా విడుద‌లైంద‌ని, అది రెండు రోజుల‌కు మించి ఆడ‌లేద‌న్న విష‌యం చిరు గుర్తించి – లూసీఫ‌ర్ ని రీమేక్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్టు వినికిడి. 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
లెక్కల డైరెక్టర్ తో మెగాస్టార్...?
లెక్కల డైరెక్టర్ తో మెగాస్టార్...?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.