(Local) Wed, 02 Dec, 2020

మెగాస్టార్ తొలి చిత్ర దర్శకుడికి తీవ్ర అస్వస్థత.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు..

November 15, 2019,   3:17 PM IST
Share on:
మెగాస్టార్ తొలి చిత్ర దర్శకుడికి తీవ్ర అస్వస్థత..  ...

చిత్రరంగంలో ఎవరు ఏ స్థితికి చేరుకుంటారో చెప్పడం కొంచెం కష్టమే...సినిమాలు హిట్ అయినప్పటికీ కొందరు ఆర్థికంగా కానీ పాపులారిటీ పరంగా కానీ పైకి రాలేని సంఘటనలు ఎన్నో...అలాంటి వారిలో దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ ఒకరు....ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఆయన ఎవరో కాదు....టాలీవుడ్ మెగాస్టార్ గా పిలవబడే చిరజీవిని తొలి సారిగా కెమెరా ముందుకు నిలబెట్టిన దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ (75) మంచాన పడ్డారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సినిమాల్లో పెద్దగా సంపాదించక పోవడం వలన ఇప్పుడు ఆయన ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు.

నిజానికి ఆ సినిమా చిరంజీవికే కాక ఆయనకు కూడా మొదటి సినిమానే అయినా ఆ మొదటి ప్రయత్నంలోనే 5 నంది అవార్డులు అందుకొని రాజ్‌కుమార్‌ తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ సామాజిక సమస్యల మీదనే ఉన్నాయి. అయితే సినిమాలు తీసి చితికిపోయిన ఆయన  ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య కాలం చేయడంతో ఒంటరివాడయ్యాడు.  మెగాస్టార్‌ ని పరిచయం చేసిన ఆయన తానూ మాత్రం స్టార్ కాలేక పోయాడు. ఇండస్ట్రీలో ఎంతో మందిని ఆదుకున్న చిరంజీవి ఈయనను కూడా ఆదుకుంటారేమో చూడాలి. 

సంబంధిత వర్గం
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
ఆర్టిక‌ల్ 370 ని తెరకెక్కిస్తున్న దర్శకుడు....
ఆర్టిక‌ల్ 370 ని తెరకెక్కిస్తున్న దర్శకుడు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.